ఇళ్లకు వెళ్లే ధైర్యం లేక..
చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి అతివృష్టి, అనావృష్టితో పంటలు పండలేదు. ప్రభుత్వమూ ఆదుకోలేదు. విత్తనాలు, ఎరువులూ ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టారు. పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా రైతు ఇళ్లకు వెళ్లాల్సి ఉన్నా...అధికారులు, ప్రజాప్రతినిధులు అంత సాహసం చేయలేకపోయారు. నేను కూడా రైతునే. కానీ రైతు సేవా కేంద్రం సిబ్బంది ఎవరూ నా దగ్గరకు రాలేదు.
– ఆవుటాల రమణారెడ్డి, రైతు,
జిల్లా అగ్రిబోర్డు మాజీ చైర్మన్


