ఓటరు మ్యాపింగ్ సర్వే వేగవంతం చేయండి
మడకశిర రూరల్: ఓటరు జాబితా మ్యాపింగ్ సర్వేను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. మడకశిర మండలం ఆర్.అనంతపురం వద్ద పరిశ్రమలకు సంబంధించిన భూములను పరిశీలించేందుకు గురువారం వచ్చిన ఆయన సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఇప్పటి వరకు 37 శాతం మాత్రమే ఓటరు జాబితా మ్యాపింగ్ సర్వే పూర్తి చేశారని అధికారులపై మండి పడ్డారు. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. అనంతరం రైతులను కలసి సమస్యలపై ఆరా తీశారు. కార్యకర్మంలో తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ కార్యకర్త దాడి
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్‌సీపీ నాయకుడు చింతా శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్త వినయ్‌నాయక్ దాడికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితుడు గురువారం పుట్టపర్తి అర్బన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు... వ్యక్తిగత పనిపై జిల్లా కేంద్రానికి వచ్చిన పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామానికి చెందిన చింతా శ్రీధర్‌రెడ్డి స్థానిక సత్యసాయి సూపర్ ఆస్పత్రి ఆటో స్టాండ్ వద్ద నిలబడి ఉండగా బడేనాయక్ తండాకు చెందిన టీడీపీ కార్యకర్త వినయ్‌నాయక్ గొడవ పడి ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. వారం రోజుల్లోపు చంపేస్తామంటూ బెదిరిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న శ్రీధర్‌రెడ్డిని స్థానికులు వెంటనే సత్యసాయి జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓటరు మ్యాపింగ్ సర్వే వేగవంతం చేయండి


