జాతీయ స్థాయి చిత్రకళ పోటీల్లో ప్రతిభ
పుట్టపర్తి టౌన్: జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో పుట్టపర్తిలోని జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. వివరాల్లోకి వెళితే... స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ ఆర్ట్స్ టీచర్ చంద్రమోహన్ నేతృత్వంలో వివిధ పాఠశాలలకు చెందిన 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న 106 మంది విద్యార్థులకు పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, టూటూ డిజైనింగ్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. మొత్తం 59 మంది విద్యార్థులు పాల్గొనగా 25 బంగారు పతకాలు, 13 వెండి పతకాలు, 12 కాంస్య పతకాలను సాధించారు. వీరికి ఆ పాఠశాల హెచ్‌ఎం వెంకటరమణ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, పతకాలను అందజేశారు.


