రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు
రొళ్ల: అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా రొళ్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు అపహరించారు. వివరాలోకెళితే... రొళ్ల పట్టణంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి సోమవారం రాత్రి సుమారు 8.45 నిమిషాలకు 73960 56453 ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్‌ఐ కూతురికి యాక్సిడెంట్ అయింది. అతని దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు ఫోన్‌పే ద్వారా అతనికి రూ.50 వేలు వెంటనే జమ చేయాలన్నాడు. వచ్చిన తర్వాత స్టేషన్ దగ్గర డబ్బులు చెల్లిస్తానని ఆదామ్‌రియాజ్‌షేఖ్ అనే వ్యక్తి చెప్పాడు. దీంతో ఏమీ ఆలోచించకుండా ఆ వ్యక్తి వెంటనే రూ.50 వేలు ఫోన్ పే చేశాడు. ఆ వెంటనే స్థానికంగా ఉన్న ఏఎస్‌ఐకి ఫోన్ చేసి బాధితుడు మాట్లాడితే తాను ఎవరికీ డబ్బులు ఇవ్వమని చెప్పలేదని సమాధానం ఇవ్వడంతో కంగుతిన్నాడు. వెంటనే ఫోపే చేసిన నంబర్‌కు కాల్ చేయగా స్వీచ్ ఆఫ్ వచ్చింది. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన సైబర్ క్రైమ్ అధికారులు మహారాష్ట్రలోని ఓ ఏటీఎంలో ఆదామ్‌రియాజ్‌షేఖ్ రూ.24,600 డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. మిగిలిన రూ.25,400 నగదు డ్రా చేసుకోకుండా లాక్ చేశారు. ఇదే వ్యక్తి 73960 56453 ద్వారా అనంతపురంలో మరో ఇద్దరికి మాయ మాటలు చెప్పి రూ.70 వేలు చొప్పున ఇద్దరితో ఆన్‌లైన్‌లో డబ్బులు కొట్టేసినట్లు ఏఎస్‌ఐ ఇదాయతుల్లా తెలిపారు.
యాక్సిడెంట్ పేరుతో రూ.50 వేల నగదు అపహరణ
రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు


