చికిత్స పొందుతూ యువకుడి మృతి
పరిగి: మండలంలోని బీచిగానిపల్లి గ్రామ పంచాయతీ పరిధి పాత్రగానిపల్లికి చెందిన గోపీ (18) బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు. పరిగి పోలీసుల వివరాలమేరకు.. పాత్రగానిపల్లికి చెందిన బోయ మంజునాథ్ కుమారుడు గోపీ వృత్తి రీత్యా బెంగళూరు సమీపంలోని యలహంకలో ఉండేవాడు. అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈక్రమంలో ఈనెల 10న స్వగ్రామం పాత్రగానిపల్లికి వచ్చాడు. తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్న గోపీ అదేరోజు గొల్లపల్లి సమీపంలో వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించాడు. మిత్రుడికి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు తెలియజేశాడు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి మంజునాథ్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రంగడుయాదవ్ కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం బెంగళూరులో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు.


