బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్‌పై ఫిర్యాదు
చెన్నేకొత్తపల్లి: రుణం కంతులు బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా స్వాహా చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కనుముక్కల బ్రాంచ్ బిజినెస్ కరస్పాండెంట్‌పై పొదుపు సంఘాల మహిళలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మట్లాడుతూ... ప్రసన్నాయపేటలో దాదాపు 10 పొదుపు సంఘాల సభ్యులు కనుముక్కల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో రుణాలు తీసుకున్నామన్నారు. కంతుల మొత్తాన్ని ప్రతినెలా బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ కృష్ణారెడ్డికి చెల్లించేవారమన్నారు. అయితే ఆయన ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేశాడన్నారు. ఇలా రూ.30 లక్షలకు పైగా స్వాహా చేశాడని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకులో చెల్లించే విధంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మహిళలు ఎస్‌ఐ సత్యనారాయణను కోరారు.
తప్పుల్లేని ఓటర్ల
జాబితానే లక్ష్యం
సాక్షి, పుట్టపర్తి: తప్పుల్లేని ఓటర్ల జాబితా కోసం జిల్లాలో ప్రత్యేక పునః పరిశీలనకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక పునః పరిశీలన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ముందస్తు సంసిద్ధతలో భాగంగా గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ శ్యాం ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా పునఃపరిశీలన భాగంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఓటరు వివరాలు సేకరించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదించి ఆయా పార్టీల బూత్ ఏజెంట్ల జాబితాలను నియోజకవర్గ ఎన్నికల అధికారికి సమర్పించేలా చూడాలన్నారు.
ఏడాది పాటు ‘వందేమాతరం’ ఉత్సవాలు
‘వందే మాతరం‘ గీతం ఆవిష్కరణకు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పాటు జిల్లాలో ఉత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. గురువారం ఆయన అన్నిశాఖల అధికారులతో సమావేశమయ్యారు. ‘వందేమాతరం’ గీతం సందేశం, ప్రాధాన్యతను ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. శుకవ్రారం ఉదయం 10 గంటలకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సామూహికంగా ‘వందేమాతరం‘ గీతం ఆలపించాలన్నారు.
బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్‌పై ఫిర్యాదు


