సాక్షి, పుట్టపర్తి: సత్యసాయి బాబా కీర్తి దశదిశలా చాటేలా శత జయంతి ఉత్సవాలకు పటిష్టంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో బాబా శతజయంతి ఉత్సవాల నిర్వహణపై అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే చేపట్టిన పనులు, వాటి ప్రగతి, ఇంకా పూర్తి చేయాల్సిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ సూర్యనారాయణ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ‘ఉజ్వల యోజన’ లబ్ధి
అర్హులైన పేదలందరికీ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధి చేకూర్చాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ విడుదల కోసం జిల్లా స్థాయి దీపం, ఉజ్వల కమిటీ సమావేశాన్ని జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. గతంలో దరఖాస్తు చేసుకున్న 2,060 మంది లబ్ధిదారులకు వీలైనంత తొందరగా ఉజ్వల కనెక్షన్స్ విడుదల చేయాలని సంబంధిత ఆయిల్ కంపెనీ అధికారులను ఆదేశించారు. అలాగే గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ప్రజల నుంచి అధిక చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలు అధికారి బి. రాజు, అయిల్ కంపెనీ జిల్లా నోడల్ అధికారి ఎంఏ అసీం, కమిటీ సభ్యులు దంటి హసనాపురం తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని
జేసీ భరద్వాజ్ ఆదేశం


