పౌర్ణమి వెలుగులు.. కార్తీక కాంతులు
పౌర్ణమి వెలుగులు...కార్తీక దీప కాంతులతో జిల్లా ప్రజ్వరిల్లింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శైవాలయాల ఎదుట బారులు తీరారు. విశేష పూజలతో ఆదిదంపతులకు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వేళ ఆలయాల్లో జ్వాలా తోరణాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు లక్ష దీపార్చన చేశారు. ఇక ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడిని పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఉయ్యాలోత్సవం నిర్వహించారు. – సాక్షి బృందం


