విద్యతోనే ఉజ్వల భవిత : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ఉజ్వల భవిత : ఎస్పీ

Oct 30 2025 7:39 AM | Updated on Oct 30 2025 7:39 AM

విద్యతోనే ఉజ్వల భవిత : ఎస్పీ

విద్యతోనే ఉజ్వల భవిత : ఎస్పీ

పుట్టపర్తి టౌన్‌: విద్యతోనే ఉజ్వల భవిత ఉంటుందని, ప్రతి విద్యార్థి కూడా ఇష్టంతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాయంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు బుధవారం బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీతో పాటు విశ్రాంత ప్రిన్సిపాల్‌ వాసుదేవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల విభాగంలో విజేతలుగా నిలిచిన వి.జయంతి, గీతిక, మనీషా, అనూష, హైందవి, సిరి, పోలీసు విభాగంలో పెద్దారెడ్డి, జబీవుల్లా, నర్మద, శ్యామల, వెంకటేశ్వరరావు, పద్మశ్రీని అభినందించారు.

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశాల

దరఖాస్తుకు నేడు ఆఖరు

కదిరి: సైనిక్‌ స్కూల్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాల (2026–27 విద్యా సంవత్సరం) దరఖాస్తుకు గురువారంతో గడువు ముగియనుంది. 6వ తరగతిలో బాలురతో పాటు బాలికలకు కూడా ప్రవేశం ఉంటుంది. 9వ తరగతిలో ప్రవేశాలకు బాలురు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేసుకున్న వారికి 2026 జనవరి రెండో వారంలో ప్రవేశ పరీక్షతో పాటు వైద్య పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్‌ వరకూ అక్కడే చదువుకోవచ్చు. 6వ తరగతిలో చేరే విద్యార్థులు 10 నుంచి 12 ఏళ్లు, తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులకు 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివిన వారికి అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement