తెల్లగా నురుగలు కక్కుతూ కనిపిస్తుంది... చిన్ననోటు జేబులో ఉంటే చాలు.. గొంతులోకి దిగి నిషా నశాలానికెక్కుతుంది. బానిసలుగా మార్చి జీవితాలను ఛిద్రం చేస్తుంది. రసాయనాలు, నిషేధిత మత్తు పదార్థాలతో తయారవుతున్న ‘కల్లు’ కాలకూట విషంగా మారి ప్రాణాలు తీసుకుంటోంది. పట్ట | - | Sakshi
Sakshi News home page

తెల్లగా నురుగలు కక్కుతూ కనిపిస్తుంది... చిన్ననోటు జేబులో ఉంటే చాలు.. గొంతులోకి దిగి నిషా నశాలానికెక్కుతుంది. బానిసలుగా మార్చి జీవితాలను ఛిద్రం చేస్తుంది. రసాయనాలు, నిషేధిత మత్తు పదార్థాలతో తయారవుతున్న ‘కల్లు’ కాలకూట విషంగా మారి ప్రాణాలు తీసుకుంటోంది. పట్ట

Oct 30 2025 7:37 AM | Updated on Oct 30 2025 7:37 AM

తెల్ల

తెల్లగా నురుగలు కక్కుతూ కనిపిస్తుంది... చిన్ననోటు జేబుల

హిందూపురం/చిలమత్తూరు: ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హిందూపురం అటు కర్ణాటక, ఇటు జిల్లాకు సరిహద్దులో ఉండటంతో ఇక్కడ రెండు రాష్ట్రాల వారు కల్లు కోసం హిందూపురం వస్తున్నారు. అయితే కల్లు ఉత్పత్తి చేసే ఈత చెట్లు తక్కువగా ఉండటం..డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కల్లు విక్రయదారులు రసాయన మందులతో కల్తీకల్లు తయారు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా కాసులకు కక్కుర్తి పడి పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు.

ఉత్పత్తి తక్కువ... డిమాండ్‌ ఎక్కువ

ఒక్కో ఈత చెట్టు నుంచి రోజుకు 1.5 లీటర్లు నీరా వస్తుంది... ఇలా హిందూపురం ప్రాంతంలో 2 వేల లీటర్లు మించి ఉత్పత్తి లేదని తెలుస్తోంది. కల్లు వ్యాపారులు వివిధ ప్రాంతాల్లో సేకరించిన కల్లును హిందూపురం పరిసరాల్లోని కల్లుడిపోకు తరలించి అక్కడి చెక్కతొట్టెల్లో నీరాతోపాటు అవసరమైన మేరకు నీరు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే డైజోఫాం తదితర రసాయన మందులను కలిపి 20 వేల నుంచి 25 వేల లీటర్లకుపైగా కల్లును సిద్ధం చేస్తున్నారు. వాటిని బాటిళ్లలో నింపి చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, పరిగి మండలాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అయితే కల్లు దుకాణదారులు కూడా మధ్యాహ్నం దాటిన తర్వాత పుల్లగా మారే కల్లులో మరికొంత నీరు, చాక్రీన్‌, మందులు కలిపి పెడుతున్నారు. దీంతో ఏ సమయంలో తాగినా కల్లు తీయగా ఉంటుండటంతో కల్లు ప్రియులు తెల్లని విషాన్ని గొంతులోకి పోసుకుంటున్నారు. ఇక హిందూపురం కేంద్రంగా శ్రీకంఠపురంలో టీడీపీ నేతలు గోడౌన్‌లో మత్తు కల్లు తయారు చేసి హిందూపురం పట్టణం, రూరల్‌ మండలాల్లోని చౌళూరు, సంతెబిదనూరు గ్రామాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇలా కల్తీ కల్లుకు బానిసైన వారు రానురాను మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిన్నారు. అంతేగాక కాలేయం దెబ్బతిని ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎమ్మెల్యే పీఏలకు నెల నెలా మామూళ్లు..

కల్లు దుకాణాల నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నాయి. కల్లునే ఆదాయంగా మార్చుకున్న కొందరు టీడీపీ నేతలు...తమ వ్యాపారానికి ఇబ్బందులు కలగకుండా ప్రతి నెలా ఎమ్మెల్యే కార్యాలయానికి మామూళ్లు చేరుస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. వాస్తవంగా హిందూపురం పట్టణంలో చాలా దుకాణాలకు అనుమతులు లేవు. అయినా ఇక్కడ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీని వెనుక ‘మామూళ్ల మత్తు’ ఉన్నట్లు తెలుస్తోంది.

నిద్రమత్తులో ఎకై ్సజ్‌ శాఖ..

నియోజకవర్గంలో కల్తీ కల్లుతో పాటు రసాయనాలతో కల్లు తయారు చేసి విచ్చల విడిగా విక్రయాలు చేస్తున్నా...ఎకై ్సజ్‌ శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కల్లు వ్యాపారం గ‘మ్మత్తు’గా సాగుతోంది. ఒకవేళ విజయవాడ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వచ్చి దాడులు చేసినా...వెంటనే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వారికి ఫోన్లు వెళ్తున్నాయి. ‘మనోళ్లే.. వదిలేయండి’ అని ఏకంగా అధకారులకే చెబుతున్నారు. కాదు...కూడదంటే ఉద్యోగాల్లో ఉండలేరు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో రాష్ట్రస్థాయి అధికారులు కూడా ‘కల్లు’న్నా చూడకుండా మూసుకున్నారు. మరోవైపు మద్యం దుకాణాలు, బెల్టు షాపుల ద్వారా విచ్చల విడిగా మద్యం విక్రయాలు జరుగుతుండగా.. పేదల జీవితాలు ఛిద్రం అవుతున్నాయి.

బాలయ్య ఇలాకాలో

విచ్చలవిడిగా కల్లు విక్రయాలు

హిందూపురంలో కల్తీ కల్లు.. మత్తుపదార్థాలతో కృత్రిమంగా తయారీ

తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో

బానిసలుగా మారుతున్న పేదలు

రోగాల బారిన పడి

ఆస్పత్రుల పాలవుతున్న వైనం

బుధవారం 15 మందికి అస్వస్థత..ఆరుగురి పరిస్థితి ఆందోళన కరం

ప్రజారోగ్యాన్ని గాలికి వదిలిన

కూటమి ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు

చౌళూరులో 15 మందికి అస్వస్థత

బుధవారం హిందూపురం రూరల్‌ మండల పరిధిలోని చౌళూరులో విషరసాయనాలతో తయారు చేసిన ఈతకల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు వారిని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రసాయనాలతో తయారు చేసే కల్లుకు అలవాటు పడ్డ ఇద్దరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిసుండటంతో వారిని వైద్యులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

తెల్లగా నురుగలు కక్కుతూ కనిపిస్తుంది... చిన్ననోటు జేబుల1
1/3

తెల్లగా నురుగలు కక్కుతూ కనిపిస్తుంది... చిన్ననోటు జేబుల

తెల్లగా నురుగలు కక్కుతూ కనిపిస్తుంది... చిన్ననోటు జేబుల2
2/3

తెల్లగా నురుగలు కక్కుతూ కనిపిస్తుంది... చిన్ననోటు జేబుల

తెల్లగా నురుగలు కక్కుతూ కనిపిస్తుంది... చిన్ననోటు జేబుల3
3/3

తెల్లగా నురుగలు కక్కుతూ కనిపిస్తుంది... చిన్ననోటు జేబుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement