దోపిడీకే మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ | - | Sakshi
Sakshi News home page

దోపిడీకే మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ

Oct 30 2025 7:37 AM | Updated on Oct 30 2025 7:37 AM

దోపిడ

దోపిడీకే మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ

గాండ్లపెంట: ‘‘కూటమి ప్రభుత్వం దోపిడీకే మెడికల్‌ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఉన్నత ఆశయంతో 17 మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అందులో ఐదు కళాశాలలు పూర్తి కాగా అడ్మిషన్లు కూడా జరిగి పేద కుటుంబాల్లోని విద్యార్థులు వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూటమి సర్కార్‌లోని పెద్దలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి తమ జేబులు నింపుకునేందుకు సిద్ధమయ్యారు’’ అని వైఎస్సార్‌ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన గాండ్లపెంట, సోమయాజులపల్లి, తూపల్లి, మలమీదపల్లి గ్రామాల్లో ‘రచ్చబండ’ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా నియోజకవర్గ పరిశీలకుడు కొండవీటి నాగభూషణం, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మండల పరిశీలకుడు లింగాల లోకేశ్వరరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ప్రజలతో కోటీ సంతకాల సేకరణ చేపట్టారు. వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి పేదలకు వైద్యం దూరం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పార్టీ గ్రామ కమిటీల నియమించి నూతన సభ్యులను పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు ఫయాజ్‌ అలీ, మాజీ ఎంపీపీ తాతం జగన్మోహన్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, మాజీ కన్వీనర్‌ పోరెడ్డి చంద్రశేఖరరెడ్డి, సర్పంచ్‌లు చలపతి, రమణానాయక్‌, ఎస్సీ సెల్‌ నాయకులు మేకల నరసింహులు, జిల్లా బీసీ సెల్‌ కన్వీనర్‌ జక్కల లక్ష్మీనరసింహగౌడ్‌, సొసైటీ మాజీ అధ్యక్షుడు ఎస్పీ హైదర్‌వలీ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు హైదర్‌వలీ, జిల్లా కోఆప్షన్‌ మాజీ సభ్యుడు సీఎస్‌ అబ్దుల్‌రవూఫ్‌, రైతు సంఘం నాయకులు వద్దిరెడ్డి కృష్ణారెడ్డి, దామోదర్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు అమీర్‌ఖాన్‌, మండల వైస్‌ కన్వీనర్లు శంకర్‌నాయుడు, ఖాజావలి, అత్తార్‌ ఆసీఫ్‌, కార్యదర్శి సమీర్‌, నాయకులు పామిడి ఇక్బాల్‌, మైనుద్దీన్‌, నాగరాజు, ముజాహీద్‌, బహవుద్దీన్‌, మాజీ సర్పంచ్‌లు హుస్సేన్‌పీరా, గజ్జల రామకృష్ణారెడ్డి, రామాంజులరెడ్డి, మాజీ డైరెక్టర్‌ పుల్లారెడ్డి పాల్గొన్నారు.

పేదలకు వైద్యం దూరం చేస్తే

చూస్తూ ఊరుకోం

హెచ్చరించిన బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌

పలు గ్రామాల్లో ‘రచ్చబండ’ కార్యక్రమం

దోపిడీకే మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ 1
1/1

దోపిడీకే మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement