
కల్తీ మద్యం ధర్మవరాన్ని కబళిస్తోంది. క్వార్టర్ తాగితే
ఒక బ్రాండ్ మద్యం క్వార్టర్ బాటిల్ బహిరంగ మార్కెట్‌లో రూ.200 ఉంటే, అచ్చు దాన్ని పోలినట్లే ఉండే కల్తీ మద్యం కేవలం రూ.40కే మద్యం షాపు యజమానులకు అందుతోంది. దీంతో లాభం బాగా వస్తుండటంతో సదరు మద్యం షాపు యజమానులు ఇష్టారాజ్యంగా.. బెల్ట్‌షాపులకు, ధాబాలు, చిన్నపాటి హోటళ్లకు ఎంఆర్‌పీ కంటే తక్కువకే సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడటం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.
‘మాది మాకిస్తే... మీరు ఏమైనా చేసుకోవచ్చు. కల్తీ మద్యం విక్రయించుకున్నా మాకు అభ్యంతరం లేదు. విజయవాడ నుంచి ఎప్పుడైనా స్క్వాడ్ వస్తే వారికీ అంతో ఇంతో ఇవ్వండి. మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు’’
– ధర్మవరంలోని మద్యం షాపుల నిర్వాహకులతో
ఓ ఎకై ్సజ్ అధికారి చెప్పిన మాటలివి.
ధర్మవరం: కల్తీ మద్యం పేద, మధ్య తరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. రోజంతా పని చేసి రిలాక్స్ కోసమో.. వ్యసనానికి అలవాటు పడో మందుబాబులు... వైన్‌షాపులు, బెల్ట్‌షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసి తాగుతున్నారు. ఆ తర్వాత పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ... అరుస్తూ.. రోడ్లపైనే అచేతనంగా పడిపోతున్నారు. కొందరు ఆ తర్వాత కోలుకున్నా రోగాలతో బాధపడుతున్నారు. మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. అయినా ఆ చావులేవీ లెక్కల్లోకి రాకుండా ‘కల్తీ మద్యం దందా ముఠా’ మ్యానేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పల్లెపల్లెనా బెల్టుషాపులు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మవరం నియోజకవర్గంలో బెల్ట్‌షాపులు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ధర్మవరం పట్టణంలోనే 20 దాకా బెల్ట్‌షాపులు ఏర్పాటయ్యాయి. ఇక ధర్మవరం రూరల్ మండలంలో 13, తాడిమర్రి మండలంలో 15, ముదిగుబ్బలో 100, బత్తలపల్లిలో 40 దాకా బెల్ట్‌షాపులు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఇవికాక ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి పార్టీలు, తటస్తులకు సంబంధించి 20 దాకా మద్యం దుకాణాలున్నాయి. ఈ దుకాణాలకు సమీపంలోనే బార్‌ను తలపించే విధంగా ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసి పర్మిట్ రూం తరహాలో బాహాటంగానే మద్యం తాగిస్తున్నారు.
యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు..?
మద్యం దుకాణాలను రూ.లక్షలు పోసి దక్కించుకున్న కూటమి పార్టీల నాయకులకు అంతగా ఆదాయం రావడం లేదు. మరోవైపు అమ్మకాలపై 20 శాతం ఇస్తామన్న కమీషన్ తగ్గించారు. దీంతో మద్యం షాపు యజమానులు ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. ఈక్రమంలోనే మద్యాన్ని కల్తీ చేసి లాభాలు గడిస్తున్నారు. మదనపల్లి, చిత్తూరు, పావగడ సరిహద్దు ప్రాంతాల్లో అధికార పార్టీల నాయకులు ఏకంగా ఫ్యాక్టరీలే పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో ఎక్కువగా ధర్మవరం నియోజకవర్గానికే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్‌లను పోలి ఉండేలా స్పిరిట్, ఫ్లేవర్‌లతో పాటు ఇతర రసాయనాలను కలిపి అచ్చం ఒరిజినల్ ప్యాకింగ్, సీల్‌లతో పాటు హోలోగ్రాంలు వేసి ప్రతికేస్‌లో సగానికిపైగా పెట్టి విక్రయిస్తున్నట్లుగా సమాచారం.
తాగితే పడిపోవాల్సిందే..
ధర్మవరం ప్రధాన కూడళ్లలో మందుబాబులు అచేతనంగా పడిపోయి కనిపిస్తున్నారు. ఇటీవల ఏకంగా ధర్మవరం డీఎస్పీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద మందుబాబు మద్యం సేవించి పడిపోయడు. దీంతో అతడిపై ఎన్ని నీళ్లు పోసినా అతని స్పృహ రాలేదు. దీంతో పలువురు కానిస్టేబుళ్లు అతడిని బైక్‌పై మరో ప్రాంతానికి తీసుకువెళ్లి దిగబెట్టి వచ్చారు. కల్తీ మద్యం తాగడం వల్లే అతను అలా పడిపోయాడని స్థానికులు చర్చించుకున్నారు.
శ్రమజీవులు, నిరుపేదలే అధికం..
ధర్మవరంలో ఎక్కువ శాతం రోజువారి కూలీలు, చేనేత కార్మికులే ఉన్నారు. వీరు రోజంతా కష్టపడి సాయంత్రం వేళ మద్యం సేవిస్తే అది కాస్తా కల్తీమయం కావడంతో అనారోగ్యం పాలవుతున్నారు. పట్టణంలోని కొత్తపేట, ఎల్‌సీకేపురం, తారకరామాపురం, గుట్టకిందపల్లి, శివానగర్, శాంతినగర్ తదితర శివారు ప్రాంతాల్లో చాలామంది మద్యం సేవించి గుండెపోటుకు గురి కావడం, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మంచాన పడటం సర్వసాధారణంగా మారింది.
చర్యలు శూన్యం..
ధర్మవరానికి సరఫరా అవుతున్న కల్తీ మద్యం గురించి ఎకై ్సజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. నాలుగు నెలల క్రితం ఎకై ్సజ్ ఉన్నతాధికారి ఒకరు ధర్మవరంలోని వైన్‌షాప్ నిర్వాహకులతో రహస్యంగా సమావేశమై మామూళ్ల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో వైన్‌షాపు నుంచి నెలకు రూ.లక్ష మేర ఎకై ్సజ్ శాఖకు వెళ్తున్నట్లు సమాచారం. అలానే ధాబా నిర్వాహకులు రూ.20 వేలు, బెల్ట్‌షాపు నిర్వాహకులు ప్రాంతాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేల మేర ఎకై ్సజ్ కార్యాలయానికి ముట్టజెబుతున్నట్లుగా తెలుస్తోంది.
క్వార్టర్ రూ.40 లోపే
ధర్మవరంలో ఏరులై పారుతున్న
కల్తీ మద్యం
కూటమి పార్టీల నాయకుల అండతో యథేచ్ఛగా దందా
స్పిరిట్‌కు రంగునీళ్లు కలిపి
విక్రయిస్తున్న వైనం
కల్తీ మద్యం తాగి పిచ్చిపట్టినట్లు
ప్రవర్తిస్తున్న మందుబాబులు
రోగాల బారిన పడి
ప్రాణాలు కోల్పోతున్న వైనం
రోడ్డున పడుతున్న బాధిత కుటుంబాలు
మామూళ్ల మత్తులో జోగుతున్న
ఎకై ్సజ్ పోలీసులు

కల్తీ మద్యం ధర్మవరాన్ని కబళిస్తోంది. క్వార్టర్ తాగితే

కల్తీ మద్యం ధర్మవరాన్ని కబళిస్తోంది. క్వార్టర్ తాగితే

కల్తీ మద్యం ధర్మవరాన్ని కబళిస్తోంది. క్వార్టర్ తాగితే

కల్తీ మద్యం ధర్మవరాన్ని కబళిస్తోంది. క్వార్టర్ తాగితే