
సరిహద్దులోనే ‘కల్తీ’ తయారీ
● బైక్‌లపై ధాబా, హోటళ్లు,
బెల్ట్‌షాపులకు డెలివరీ
సోమందేపల్లి: కల్తీ మద్యం హిందూపురం, పరిగి మండలాల పరిధిలో తయారవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడే కల్తీ మద్యం తయారు చేసి లేబుళ్లు అతికించి సోమందేపల్లి, గోరంట్ల, పరిగి, పెనుకొండ మండలాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అనుమానం రాకుండా సరుకుల తరహాలో ప్యాకింగ్ చేసి బైక్‌లపై హోటళ్లు, ధాబాలు, బెల్ట్‌షాపులకు డెలివరీ చేస్తున్నారు. ఓ బ్రాండ్ మద్యం 48 బాటిళ్ల ధర రూ.4,800 ఉంటే... తాము రూ.3 వేలకే ఇస్తామని బేరసారాలు చేస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. దీంతో లాభం బాగా వస్తుందన్న ఆశతో బెల్టుషాపులు, కొన్ని మద్యం దుకాణాల నిర్వాహకులు కల్తీకి ఓటు వేస్తున్నారు. కూలీలు, కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కూటమి పార్టీల నాయకులు, అధికారుల హస్తం ఉండడంతో కల్తీ మద్యం దందా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కట్టడి చేయాల్సిన ఎకై ్సజ్ శాఖ అధికారులే మామూళ్ల మత్తులో మునిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.