తిండి గింజలకూ తిప్పలే! | - | Sakshi
Sakshi News home page

తిండి గింజలకూ తిప్పలే!

Sep 30 2025 8:46 AM | Updated on Sep 30 2025 8:46 AM

తిండి గింజలకూ తిప్పలే!

తిండి గింజలకూ తిప్పలే!

‘‘65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి

రేషన్‌ డీలర్‌ ద్వారా వారి ఇంటికే బియ్యం డెలివరీ చేస్తాం. అది కూడా ఒకటో తేదీ రాక మునుపే.. అంటే ముందు నెల 26 నుంచి 30వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగిస్తాం.’’

– ఇదీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటన.

వాస్తవానికి ఇది ప్రకటనకే పరిమితమైంది. ఎక్కడా ఆచరణకు నోచుకోలేదు.

కదిరి: గత ప్రభుత్వం అన్ని వర్గాల వారికీ ఇంటి దగ్గరే రేషన్‌ బియ్యం పంపిణీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికీ రేషన్‌ పంపిణీకి మంగళం పాడింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ చేసే 18 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇందులో జిల్లాకు చెందిన కుటుంబాలు 349 ఉన్నాయి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులతో పాటు మంచానికి పరిమితమైన వారికి రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలు కావడంలేదు. వృద్ధులు జీవిత చరమాంకంలో ఊతకర్రల సాయంతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చౌక బియ్యం తెచ్చుకుంటున్నారు. బియ్యం సంచిని భుజంపై కూడా పెట్టుకోలేని స్థితిలో చుట్టుపక్కల వారిని సాయం కోసం బతిమాలుకుంటున్నారు.

వేలిముద్రలు సరే.. బియ్యం ఏదీ?

జిల్లాలో కొన్ని చోట్ల రేషన్‌ డీలర్లు దివ్యాంగులు, వృద్ధుల ఇంటి దగ్గరకు వెళ్లి రేషన్‌ బియ్యం పంపిణీ చేసినట్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. కానీ వారికి అక్కడ బియ్యం ఇవ్వడం లేదు. కుటుంబ సభ్యులు లేదా బంధువులెవరైనా చౌక డిపో వద్దకు వస్తే గానీ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇంకొందరు డీలర్లు వేలి ముద్రలు వేయించుకోవడంతోనే సరిపెట్టి.. బియ్యం వచ్చే నెలలో ఇస్తామంటున్నారు. వారి కోటా బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు.

తూకంలో మోసాలు..

జిల్లా వ్యాప్తంగా 1,367 రేషన్‌ దుకాణాలుండగా.. వీటి పరిధిలో 5,62,784 రేషన్‌ కార్డులు ఉన్నాయి. కార్డుదారుల్లో 63,286 మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం పట్టిన వారు ఉన్నారు. మనిషికి ఐదు కిలోల చొప్పున రేషన్‌ బియ్యం, కార్డుకు అర కిలో చొప్పున చక్కెర పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇంటి దగ్గరకే వెళ్లి కచ్చితమైన తూకాలతో రేషన్‌ బియ్యం అందజేసేవారు. కూటమి ప్రభుత్వంలో మెజార్టీ చౌకడిపో డీలర్లు అధికార పార్టీ వారే కావడంతో తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కళ్లెదుటే మోసాలకు పాల్పడుతున్నా సామాన్య ప్రజలు అడగలేని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే..అధికారులు తనిఖీకి వస్తున్నారనే సమాచారం సదరు డీలర్‌కు ముందే తెలిసిపోతోంది.

వృద్ధులు, దివ్యాంగులకు

ఇంటి వద్దకే రేషన్‌ ఉత్తిదే

సుదూరం నుంచి రాలేక

అవస్థలు పడుతున్న వృద్ధులు

సాయం చేసేవారు లేక

దివ్యాంగుల ఎదురు చూపులు

వేలిముద్రలతో సరిపెడుతున్న

స్టోర్‌ డీలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement