
పార్టీ శ్రేణులకు అండగా డిజిటల్ బుక్
గోరంట్ల: పార్టీ శ్రేణులకు అండగా ఉండేందుకు జగనన్న డిజిటల్ బుక్ ప్రారంభించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ విధానాల కారణంగా ఎవరికై నా ఇబ్బందులు ఎదురైతే వాటిని డిజిటల్ బుక్‌లో నమోదు చేసుకోవాలని, పార్టీ తప్పకుండా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని వానవోలు గ్రామంలో ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో కాఫీవిత్ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఆమె పార్టీ శ్రేణులతో కలసి గడప గడపకూ వెళ్లి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన విధానాన్ని వివరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోహన్‌రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ మేలు చేశారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి కూటమి నేతలు పైశాచిక అనందం పొందుతున్నారన్నారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో పార్టీ శ్రేణులతో కలసి డిజిటల్ బుక్ పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ మండల కన్వీనర్ వెంకటేశు, వానవోలు సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మండలంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్