
మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయం
పుట్టపర్తి టౌన్: జిల్లాలోని మహిళలు, చిన్నారుల రక్షణే మొదటి కర్తవ్యంగా భావిస్తూ పోక్సో కేసుల్లో ముద్దాయిలకు శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా బాలికలు, చిన్నారులకు సంబంఽధించి 2024 జూన్ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 110 కేసులు నమోదయ్యాయని, ఇందులో 79 పోక్సో, 31 మిస్సింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. రామగిరి మండలంలో పోక్సో కేసుకు సంబంధించిన ముద్దాయిలను జైలుకు పంపినట్లు తెలిపారు. బాల్య వివాహాల నివారణకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఎస్పీ సతీ్‌ష్‌కుమార్