
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి
● కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్, ఇతర అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా 246 అర్జీలు అందగా.. వాటిని పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన పిదప నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంలో పారదర్శకత ముఖ్యమన్నారు. పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి అర్డీవో సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైన అలవాట్లతో గుండె పరిరక్షణ
ప్రశాంతి నిలయం: ఆరోగ్యకరమైన అలవాట్లతో హృదయాన్ని పరిరక్షించుకోవచ్చునని వక్తలు అన్నారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు పుట్టపర్తిలో ఘనంగా జరిగాయి. సత్యసాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజల అనంతరం వేడుకలను ప్రారంభించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, గుండైవెద్య నిపుణులు, మేధావులు ర్యాలీగా ప్రశాంతి నిలయం నుంచి హిల్‌వ్యూ సేడియం చేరుకున్నారు. హృదయాకారం ఏర్పాటు చేసి..గుండె ప్రాధాన్యతను వివరించారు.

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి