
వైద్య సేవల్లో లోపాలు తలెత్తరాదు
పరిగి: మహిళలకు అందజేస్తున్న వైద్య సేవల్లో లోపాలు తలెత్తరాదని వైద్య, ఆరోగ్య సిబ్బందిని స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమ స్టేట్ నోడలాఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్ ఆదేశించారు. స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పరిగిలోని పీహెచ్‌సీలో బుధవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. మహిళల ఆరోగ్య భద్రత కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం పలువురు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దారు హసీనాసుల్తానా, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు నవీన, స్వరూపరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మంజువాణి, ఆర్‌ఐ సిద్దేశ్వర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లలిత, సిబ్బంది పాల్గొన్నారు.
స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్
కార్యక్రమ స్టేట్ నోడలాఫీసర్ అనిల్‌కుమార్