
కుక్కలను అలా వదిలేస్తే ఎలా?
కూటమి ప్రభుత్వం కుక్కలను చాలా తక్కువగా అంచనా వేస్తోంది. ఎంతోమంది పిల్లలను కరిచినా పట్టించుకోవడం లేదు. ఎక్కడచూసినా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లోకి రావాలంటేనే పెద్దలే భయపడుతున్నారు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర లేదు. కూటమి నేతల పిక్కలు పట్టుకుంటేగానీ ఈ ప్రభుత్వంలో చలనం వచ్చేటట్లు లేదు.
– ఎంఐఎం అక్బర్, కదిరి
రేబిస్ సోకే ప్రమాదం
కరచిన కుక్కకు రేబీస్ వ్యాధి ఉంటే ఆ వ్యాధి మనకు సోకే ప్రమాదం ఉంది. అందుకే కుక్క కరచిన వెంటనే యాంటి రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు మేరకు 5 నుంచి 7 వ్యాక్సిన్లు వేస్తారు. కుక్కకాటుకు గురైన వ్యక్తి నీళ్లు తాగాలన్నా, నీటి శబ్ధానికి భయం పడినా... జ్వరం తదితర అనారోగ్య లక్షణాలున్నా రేబీస్ వ్యాధిగా పరిగణించాలి. –డా.ఫైరోజ్‌బేగం,
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి

కుక్కలను అలా వదిలేస్తే ఎలా?