
‘నువ్వు ఉండమ్మా..’
ఆర్డీటీ అంశంపై జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా ఎంపీ అంబికా వారించ బోయారు. జోక్యం చేసుకున్న గిరిజమ్మనుద్దేశించి ‘నువ్వు ఉండమ్మా.. అంటూ ఏకవచనంతో సంబోధించారు. ఇందుకు గిరిజమ్మ దీటుగా స్పందించారు. జెడ్పీ చైర్‌పర్సన్ హోదాలో సభను నడిపిస్తుంటే ఏకవచనంతో ఎలా మాట్లాడుతారంటూ నిలదీయడంతో ఎంపీ సర్దుకున్నారు. తరువాత గుమ్మఘట్ట ఎంపీపీ భవాని మాట్లాడుతూ తాను దళితురాలినని ఎంపీడీఓ వివక్ష చూపుతున్నారని, జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ దృష్టికి తెస్తే ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఈఓ డొంక తిరుగుడు సమాధానాలు ఇవ్వడంతో మిగిలిన జెడ్పీటీసీ సభ్యులందరూ ఒక్కసారిగా ఎదురు తిరిగారు. ఒక ప్రజాప్రతినిధికి ఇంత అవమానం జరిగితే చూస్తా.. చేస్తా అంటారా అంటూ మండిపడ్డారు.