
ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలి
పుట్టపర్తి అర్బన్: వైద్య ఆరోగ్య శాఖలో పని చేసే ఉద్యోగులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. శనివారం పుట్టపర్తి మండలం ఎనుములపల్లి, కర్ణాటక నాగేపల్లి, పుట్టపర్తి ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వైద్యం కోసం ఆస్పత్రులకు వచ్చే ప్రజలు ఈహెచ్‌ఆర్ నమోదు కోసం ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ఆరాతీశారు. ప్రజలకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడీలు క్రియేట్ చేయాలని ఆదేశించారు. కర్ణాటక నాగేపల్లిలో వ్యాధి నిరోధక టీకా కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు ఇచ్చే టీకాలను పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఏఎన్‌ఎంను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మునిచంద్రిక, సీహెచ్‌ఓ వన్నప్ప, సిబ్బంది పాల్గొన్నారు.
భాస్కర్‌రెడ్డి మృతి
తీరని లోటు
మడకశిర: వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతి ఉమ్మడి అనంతపురం జిల్లాకు తీరని లోటని మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులతో కలిసి రఘువీరారెడ్డి శనివారం అనంతపురంలో తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భాస్కర్‌రెడ్డి సతీమణి, జిల్లాపరిషత్ మాజీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవితను ఓదార్చారు.
ఇసుక టిప్పర్లు స్వాధీనం
ముదిగుబ్బ: ఉప్పలపాడు సమీపంలోని చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివరాముడు శనివారం తెలిపారు. సీజ్ చేసిన టిప్పర్లను మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు అప్పగించిచినట్లు పేర్కొన్నారు.

ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలి