
హోరాహోరీగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
బత్తలపల్లి: రామాపురం జెడ్పీహెచ్‌ఎస్ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల 10వ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రెండో రోజు శనివారం పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం – తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగిన పోటీలో తూర్పుగోదావరి, ప్రకాశం – విశాఖపట్నం మధ్య జరిగిన పోటీలో ప్రకాశం జట్టు విజయం సాధించాయి. బాలికల విభాగంలో గుంటూరు–విశాఖపట్నం మధ్య జరిగిన పోటీలో గుంటూరు, శ్రీకాకుళం–తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగిన పోటీలో శ్రీకాకుళం జట్టు విజయం సాధించాయి. బాలుర విభాగంలో ప్రకాశం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలు సెమీఫైనల్‌కు చేరాయి. బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు సెమీఫైనల్‌కు చేరాయి. కాగా.. శనివారం నాటి పోటీలను హెచ్‌ఎం వెంకటనాయుడుతో కలిసి ఎంఈఓ సుధాకర్‌నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయశంకర్‌రెడ్డి, చైర్మన్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ బాలాజీ, జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీ వెంకటేష్, పీడీ తలారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.