
అనంతపురం క్రికెట్‌కు వన్నె తెచ్చిన అనూష
అనంతపురం: భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అనంతపురం క్రికెట్ చరిత్రకు వన్నె తెచ్చిన గొప్ప క్రీడాకారిణి అనూష అని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అన్నారు. అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో శనివారం రాయలసీమ క్రికెట్ మైదానాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సీనియర్ క్రీడాకరులు చొరవ చూపించాలన్నారు. ఈ సందర్భంగా భారత జట్టు మహిళా క్రికెటర్ అనూషకు లక్ష రూపాయల చెక్కును జిల్లా క్రికెట్ సంఘం తరఫున మాంఛోఫెర్రర్ అందజేశారు. అనంతరం సీనియర్ క్రికెటర్లు ఒక మ్యాచ్ ఆడారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వి.భీమలింగారెడ్డి, వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, మాజీ అధ్యక్షుడు పి.మల్లికార్జున, మాజీ రంజీ క్రీడాకారలు కేఎస్ షాబుద్దీన్, ఎల్‌ఎన్ ప్రసాద్‌రెడ్డి, కేఏ ఫయాజ్ అహమ్మద్, డి.సురేష్, షేక్షావలి, డీబీ ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.