
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ కార్యదర్శి
ధర్మవరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ కార్యదర్శిగా ధర్మవరం పట్టణానికి చెందిన దేవరకొండ రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు
కలెక్టర్‌పై
లోకాయుక్తకు ఫిర్యాదు
● రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలకు సహకరించారంటూ ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త
చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలకు సహకరించారంటూ కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్‌పై కర్నూలులోని లోకాయుక్త కార్యాలయానికి ఆర్టీఐ ప్రచార కార్యకర్త ఆంజనేయులు గురువారం ఫిర్యాదు చేశారు. బయటి ప్రాంతం నుంచి వచ్చిన రియల్టర్ రెడ్డెప్పశెట్టి స్థానిక రైతుల నుంచి వందలాది ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో పాటు నది, నదీ పోరంబోకు స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, ఏపీఐఐసీ భూములను ఆక్రమించుకుని కంచె ఏర్పాటు చేసుకున్నాడన్నారు. పాలీహౌస్‌లు, ఫారం పాండ్లకు రూ. కోట్ల విలువైన సబ్సిడీ పొంది ప్రభుత్వాన్ని మోసం చేశాడన్నారు. అక్రమాలపై ‘‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాలపై స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఆక్రమలు వాస్తవమని గుర్తించారన్నారు. ఉన్నతాధికారులు సైతం ఎవిక్షన్ నోటీసులు కూడా జారీ చేసి, చేతులు దులుపుకున్నారని, రియల్టర్‌కు దాసోహమంటూ ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
బయోమెట్రిక్ అటెండెన్స్
తప్పని సరి
పెనుకొండ: బయో మెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలని సచివాలయ సిబ్బందిని మున్సిపల్ ఆర్‌డీ నాగరాజు ఆదేశించారు. పెనుకొండలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం సచివాలయ సిబ్బందితో ఆయన సమావేశమై మాట్లాడారు. వివిధ అంశాలపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సతీష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
యువతి బలవన్మరణం
హిందూపురం: మండలంలోని కొటిపి గ్రామ ఎస్సీ కాలనీలో నివాసముంటున్న మంజునాథ్ కుమార్తె ఉషారాణి (19) ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఇంటి పట్టునే ఉంటున్న ఆమె కడుపు నొప్పి తాళలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటోను ఢీకొన్న లారీ
● ఎనిమిది మంది మహిళా
కార్మికులకు గాయాలు
హిందూపురం: స్థానిక మణేసముద్రం మార్గంలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మహిళా కార్మికులు గాయపడ్డారు. కొల్లకుంట, కేతిగాని చెరువు, మణేసముద్రం గ్రామాలకు మహిళా కార్మికులు కర్ణాటకలోని గౌరిబిదనూర్ సమీపంలోని జాకీ గార్మెంట్స్ పరిశ్రమలో గురువారం రాత్రి విధులు ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మణేసముద్రం సమీపంలోకి చేరుకోగానే వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఆటో డ్రైవర్‌తో పాటు నాగమణి, లక్ష్మీదేవి, ఉమాదేవి, కీర్తన, అనుపమ, మరో నలుగురుర కార్మికులు గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా జిల్లాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీ డ్రైవర్‌కు దేహశుద్ధి
సోమందేపల్లి: హిందూపురం రూరల్ మండలం మణేసముద్రం వద్ద ఆటోను ఢీకొన్ని 8 మంది మహిళా కార్మికులు గాయపడడానికి కారణమైన లారీ డ్రైవర్‌ను గురువారం రాత్రి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో హిందూపురం పట్టణ సమీపంలోని కొట్నూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మణేసముద్రం వరకూ లారీ ఈడ్చుకెళ్లిందని గుర్తించారు. అదే సమయంలో గార్మెంట్స్ పరిశ్రమలో విధులు ముగించుకుని తిరుగు ప్రయాణమైన మహిళా కార్మికుల ఆటోను ఢీకొన్నట్లుగా నిర్ధారణ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీని ఆపకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకెళ్లిపోయాడు. దీంతో క్షతగాత్రుల బంధువులు లారీని వెంబడిస్తూ చాలకూరు సమీపంలో అడ్డుకుని, డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం హిందూపురం నుంచి వచ్చిన పోలీసులకు అప్పగించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ కార్యదర్శి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ కార్యదర్శి