
పట్టు చీరలో ప్రతిబింబించిన క్రీడాభిమానం
పావగడ: ఇటీవల టీ 20 క్రికెట్ పోటీల్లో విజయం సాధించిన ఆర్‌సీబీ జట్టుపై తనకున్న అభిమాన్ని ఓ చేనేత కార్మికుడు పురుషోత్తం ప్రత్యేకంగా చాటుకున్నారు. పావగడ తాలూకా వైఎన్ హొసకోట గ్రామానికి చెందిన పురుషోత్తం.. ఆర్‌సీబీ జట్టు లెజెండ్ విరాట్ కోహ్లితో పాటు ఇతర క్రీడాకారుల చిత్రాలను పట్టుచీరలో పొందుపరిచి క్రికెట్ అభిమానులకు కానుకగా అందించారు. ఈ చీరను మంగళవారం ఆయన ప్రదర్శించి, పలువురిని ఆకట్టుకున్నారు.
జిల్లాకు 800 మెట్రిక్ టన్నుల యూరియా
అనంతపురం అగ్రికల్చర్: ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) కంపెనీ నుంచి 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. మంగళవారం ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. ఇండెంట్ల మేరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మార్క్‌ఫెడ్‌కు 560 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 240 మెట్రిక్ టన్నులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
ఆరోగ్యకరమైన
అలవాట్లతో జీవించాలి
● ఎయిడ్స్ నియంత్రణ అధికారి సునీల్
హిందూపురం టౌన్: ఆరోగ్యకమైన అలవాట్లతో జీవనం సాగించాలని, ముఖ్యంగా యువత హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహనతో మెలగాలని జిల్లా లెప్రసి, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ సునీల్ అన్నారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు హిందూపురంలో మంగళవారం ఏర్పాటు చేసిన 5 కిలోమీటర్ల మారథాన్ రెడ్ రన్‌ను మున్సిపల్ చైర్మన్ రమేష్ జెండా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. యువత క్రమశిక్షణ కలిగి ఉండి, సామాజిక బాధ్యతతో మెలగాలని కోరారు. అనంతరం మారథాన్‌లో మొదటి స్థానం సాధించిన ఎస్‌డీజీఎస్ డిగ్రీ కళాశాలలో బీకాం విద్యార్థి జి. శ్రీనివాసబాబు, ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల బీకాం కంప్యూటర్స్ విద్యార్థిని బి.రాధిక, రెండో స్థానం సాధించిన పుట్టపర్తిలోని మంగళకర డిగ్రీ కళాశాల బీకాం విద్యార్థి కె.జయచంద్ర, ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల బీకాం కంప్యూటర్స్ విద్యార్థిని యు.పల్లవికి నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ వెంకటరత్నం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఎస్‌డీఓ ఉదయ భాస్కర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా సెక్రటరీ రామకృష్ణ, పీడీ లోక్‌నాథ్, ఎయిడ్స్ నియంత్రణ విభాగం సిబ్బంది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రగతి, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ రమణ తదితరులు పాల్గొన్నారు.

పట్టు చీరలో ప్రతిబింబించిన క్రీడాభిమానం