
ప్రాణానికే ప్రమాదం
హానికరమైన రంగులు, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. జీర్ణాశయం దెబ్బతిని అల్సర్ కూడా వస్తుంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం సక్రమంగా పని చేయడం మానేస్తాయి. ఫలితంగా ప్రాణానికే ప్రమాదం. కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, విరేచనాలతో మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఆహార పదార్థాల్లో వాడే రసాయనాలు మెదడు, ఎముకలపై కూడా ప్రబావం చూపుతాయి. చర్మంపై దద్దుర్లు, మచ్చలు కూడా వస్తాయి.
– డాక్టర్ నాగేంద్రకుమార్‌రెడ్డి, కదిరి