
సత్యసాయి వైభవం.. భక్తజన పరవశం
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన కాంచీపురం సత్యసాయి భక్తులు సత్యసాయి వైభవాన్ని చాటుతూ నిర్వహించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను పరవశింపజేశారు. సోమవారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి యూత్, బాలవికాస్‌కు చెందిన యువతులు ‘శ్రీ సత్యసాయి కరుణామృత కావ్యం’ కాలక్షేపం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీగాన వైభవ సాయి’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సాయంత్రం కాంచీపురానికి చెందిన సత్యసాయి యూత్ షిరిడీ సాయి సత్యసాయి ఇద్దరు ఒక్కటే అన్న సందేశాన్నిస్తూ నాటికను ప్రదర్శించారు. ‘షిరిడీ కే మహల్సపతి, పర్తి కే కౌన్’ పేరుతో నిర్వహించిన నాటిక భక్తులకు చక్కటి సందేశాన్నిచ్చింది.

సత్యసాయి వైభవం.. భక్తజన పరవశం