
పోషకాహార లోపాన్ని నివారించండి : కలెక్టర్
ప్రశాంతి నిలయం: పోషకాహార లోపాన్ని నివారించేలా ప్రజలను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు.ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే ‘పౌష్టికాహార మాసోత్సవం’ కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లో ఆయన విడుదల చేసి, మాట్లాడారు. ఐసీడీఎస్ పీడీ ప్రమీల మాట్లాడుతూ.. పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా ప్రధానంగా ఐదు అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్‌చార్జ్ డీఆర్వో సూర్యనారాయణరెడ్డి, అర్డీఓ సువర్ణ, డీపీఓ సమత, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు సత్వర సేవలు అందించాలి
అత్యవసర సమయంలో రోగులకు సత్వర సేవలు అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం 108 అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతమున్న 33 అంబులెన్స్ వాహనాల ద్వారా రోగులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయన్నారు. తాజాగా అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఫైరోజ్ బేగం, ఎన్టీఆర్ వైద్య సేవల కోర్డినేటర్ శ్రీదేవి, డీసీహెచ్‌ఎస్ డాక్డర్ మధుసూదన్, 108 సిబ్బంది పాల్గొన్నారు.