
ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తి
చెన్నేకొత్తపల్లి: మండలంలోని బసంపల్లిలో దళితుడు నారాయణ మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గ్రామంలో దళిత (మాల) సామాజిక వర్గానికి చెందిన శ్మశాన స్థలం వివాదంలో ఉండడంతో మృతదేహం ఖననానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. అంత్యక్రియలు అదే శ్మశానంలో చేయాలని ఓ సామాజిక వర్గం వారు... కోర్టు వివాదంలో ఉండడంతో అక్కడ చేయరాదని మరరో వర్గం వారు పట్టుపట్టారు. విషయం తెలుసుకున్న ధర్మవరం ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంతకుమార్, చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎస్‌ఐ సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని ఇరువర్గాలతో చర్చించారు. త్వరలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీనివ్వడంతో మృతుని కుటుంబ సభ్యులు, దళిత సామాజిక వర్డానికి చెందిన వారు అంగీకరించారు. దీంతో గ్రామ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో మృతదేహాన్ని సోమవారం ఖననం చేశారు.