
సత్సంబంధాలతోనే ఉన్నత శిఖరాలు
ధర్మవరం అర్బన్: విద్యార్థులతో ఉపాధ్యాయులు సత్సంబంధాలను కలిగి ఉండాలని, అప్పుడు ఆ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సినీ నటుడు వెల్లంకి నాగినీడు అన్నారు. ఆత్మీయ ట్రస్ట్, యూటీఎఫ్ ధర్మవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ధర్మవరంలోని ఎన్జీఓ హోంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగినీడు హాజరై, మాట్లాడారు. విద్యార్థుల ఆలోచనలను పసిగట్టి వాటికి అనుగుణంగా పాఠాలు బోధించాలన్నారు. శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 68 మందిని ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షుడు సురేష్‌కుమార్, పెనుకొండ డీవైఈఓ జాన్ రెడ్డప్ప, ధర్మవరం ఎంఈఓలు రాజేశ్వరిదేవి, గోపాల్‌నాయక్, హనుమంతరెడ్డి, యూటీఎఫ్ నాయకులు సుధాకర్, రమణయ్య, రామప్పచౌదరి, నారాయణస్వామి, రామకృష్ణనాయక్, బూతన్న, బాబు, శ్రీనివాసులు, మేరీవరకుమారి, మారుతి, ఆంజనేయులు, అమర్‌నారాయణరెడ్డి, హరికృష్ణ, రాంప్రసాద్, వెంకటకిషోర్, సకల చంద్రశేఖర్, సురేష్, హెచ్.రామాంజనేయులు, సాయిగణేష్, జేవీవీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.
సినీ నటుడు నాగినీడు

సత్సంబంధాలతోనే ఉన్నత శిఖరాలు