
భూ సమస్యపై యువకుడి నిరసన
చిలమత్తూరు: భూ సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వస్తే తహసీల్దార్ అందుబాటులో ఉండటం లేదని ఓ యువకుడు శనివారం ధర్నాకు దిగాడు. ఎన్నిసార్లు వచ్చినా ఖాళీ కుర్చీనే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. హిందూపురంలో పనిచేస్తున్న వెంకటేష్‌కు రెండోసారి చిలమత్తూరుకు ఎఫ్‌ఏసీ తహసీల్దార్‌గా బాధ్యతలు కేటాయించినా ఏనాడూ విధుల్లో కనిపించడం లేదన్నాడు. ఆర్థిక ఇబ్బందులున్న తాను భూమి విక్రయించుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో వివరాలు కనిపించడం లేదని, ఈ సమస్యను పరిష్కరించుకుందామని వస్తే అధికారి దొరకడం లేదన్నారు. తహసీల్దార్ వచ్చే వరకూ తాను కార్యాలయం నుంచి వెళ్లబోనని కొంతసేపు భీష్మించాడు. ఎంతకూ ఆయన రాకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది.