విత్తన సొమ్ము పక్కదారి! | - | Sakshi
Sakshi News home page

విత్తన సొమ్ము పక్కదారి!

Sep 6 2025 7:10 AM | Updated on Sep 6 2025 7:10 AM

విత్తన సొమ్ము పక్కదారి!

విత్తన సొమ్ము పక్కదారి!

అనంతపురం అగ్రికల్చర్‌: ప్రభుత్వ ఆధీనంలోని ఏపీ సీడ్స్‌కు చెల్లించాల్సిన విత్తనం సొమ్మును ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు కొందరు సొంతానికి వాడుకున్నారు. పంపిణీ చేసిన రోజు లేదా మరుసటి రోజే ఏపీ సీడ్స్‌ ఖాతాకు జమ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో ఏపీ సీడ్స్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్ము కాస్త పక్కదారి పట్టింది.

రూ.77 లక్షలు బాకీ

ఖరీఫ్‌లో ఏపీ సీడ్స్‌ ద్వారా 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ, విత్తన వరి, 50 శాతం రాయితీతో పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్‌ మెన్యూర్‌ సీడ్‌) రైతులకు పంపిణీ చేశారు. రాయితీ పోనూ రైతులు తమ వాటాగా (నాన్‌సబ్సిడీ) ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు రూ.26,93,71,674 చెల్లించారు. ఇందులో ఇప్పటి వరకూ ఏపీ సీడ్స్‌కు 26.61 కోట్లు చెల్లించినట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరో రూ.32.54 లక్షలకు పైగా సొమ్ము ఏమైందో అంతుచిక్కడం లేదు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో రూ.35,55,61,081 విలువ చేసే రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. అందులో ఏపీ సీడ్స్‌కు రూ.35.11 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.44.21 లక్షలకు లెక్క తేలాల్సి ఉంది. విత్తన పంపిణీ ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.77 లక్షల వరకు ఏపీ సీడ్స్‌కు బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి ఆర్‌ఎస్‌కే ద్వారా రూ.8.11 లక్షలు, వెస్ట్‌కోడిపల్లి ఆర్‌ఎస్‌కే నుంచి రూ.3.69 లక్షలు, ఉరవకొండ మండలం వెలిగొండ ఆర్‌ఎస్‌కే నుంచి రూ.3.05 లక్షలు, కుందుర్పి మండలం అపిలేపల్లి ఆర్‌ఎస్‌కే నుంచి రూ.2.04 లక్షలు, గుమ్మఘట్ట మండలం కలుగోడు ఆర్‌ఎస్‌కే నుంచి రూ.1.82 లక్షలు, కుందుర్పి మండలం బెస్తరపల్లి ఆర్‌ఎస్‌కే నుంచి రూ.1.24 లక్షలు... ఇలా ఏపీ సీడ్స్‌ సొమ్మును తమ సొంతానికి ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు వాడుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఓడీసీ మండలం తంగేడుకుంట, మడకశిర మండలం ఎర్రబొమ్మనహళ్లి, రామగిరి మండలం కుంటిమద్ది, తాడిమర్రి మండలం పెదకోట్ల, గాండ్లపెంట మండలం గొడ్డువెలగల, ఎన్‌పీ కుంట మండలం ఎదురుదొన, నల్లమాడ మండలం దొన్నికోట–2, అమరాపురం మండలం మద్దనకుంట ఆర్‌ఎస్‌కేల నుంచి రూ.లక్షల బకాయిలు పేరుకుపోయాయి. సొమ్ము చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేస్తున్న ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వ్యవసాయశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ సీడ్స్‌కు చెల్లించని

ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు

ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన రూ.77 లక్షల బకాయిలు

ఉదాసీనంగా వ్యవవహరిస్తున్న

వ్యవసాయాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement