
తిరుఓనం.. భక్తజన సంద్రం
ప్రశాంతి నిలయం: ఆధ్యాత్మిక ధామం ప్రశాంతి నిలయంలో కేరళ సంస్కృతి ఉట్టిపటింది. రెండు రోజులుగా సాగుతున్న ఓనం వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు వేలాది మంది కేరళీయులు వేడుకల్లో పాల్గొన్నారు. తమ సంస్కృతి సంప్రదాయాలు చాటుతూ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిగీతాలు ఆలపిస్తూ వేడుకలు నిర్వహించుకున్నారు. సాయంత్రం కేరళకు చెందిన సత్యసాయి యూత్, బాలవికాస్ చిన్నారులు ‘పరిత్రానాయ భక్తానాం’ పేరుతో సంగీత నృత్యరూపకం నిర్వహించారు. కవయిత్రి జనాభాయి జీవిత చరిత్ర గురించి చక్కగా వివరించారు. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

తిరుఓనం.. భక్తజన సంద్రం

తిరుఓనం.. భక్తజన సంద్రం