
గురువులకు అవమానం
గురుపూజోత్సవం రోజున జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను అవమానించారు. కార్యక్రమానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై న వారు, వారి కుటుంబీకులు, స్నేహితులు తరలిరాగా కనీసం కుర్చీలు కూడా వేయలేదు. దీంతో వారంతా సుమారు 3 గంటల పాటు చెట్లకిందే నిలబడ్డారు. కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం రూ.లక్ష మంజూరు చేసినా విద్యాశాఖ అధికారులు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులే 50 మందికి భోజనాలు, బొకేలు, పూలహారాలు సమకూర్చడం విశేషం.
ప్రజాప్రతినిధులకు పిలుపులేదు..
జిల్లా స్థాయి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులనూ ఆహ్వానించలేదు. స్థానిక ఎంపీపీ రమణారెడ్డిని, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీనరసమ్మ, స్థానిక సర్పంచ్ లక్ష్మీనరసమ్మ, ఎంపీటీసీ మధురిమలను విద్యాశాఖ ఆహ్వానించలేదు. కనీసం ఆహ్వాన పత్రికలో కూడా వారి పేర్లు ముద్రించలేదు. ఇటీవల నియామకమైన కార్పొరేషన్ డైరెక్టర్లు, టీడీపీ నాయకులను పిలిచి ప్రజాప్రతినిధులను అవమానించారు.