
ఆధ్యాత్మిక ధామం .. ఓనం వైభవం
ప్రశాంతి నిలయం: ప్రముఖ అధ్యాత్మిక కేంద్రమైన ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు రెండో రోజు గురువారం ఘనంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకుని ఉదయం కేరళ సత్యసాయి భక్తులు ఓనం విశిష్టతను చాటుతూ చక్కటి భక్తిగీతాలు ఆలపిస్తూ చేసిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. సాయంత్రం వేడుకల్లో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు కావ్య అజిత్ బృందం చక్కటి స్వరాలోలికిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. ముఖ్య అథితిగా ఇస్త్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. భక్తులనుద్దేశించి ప్రసంగించారు. సత్యసాయి సేవలను కొనియాడారు. సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు.

ఆధ్యాత్మిక ధామం .. ఓనం వైభవం

ఆధ్యాత్మిక ధామం .. ఓనం వైభవం