
తిరుగులేని విజయాలు
ధర్మవరం అర్బన్: ప్రైవేటు పాఠశాలలకు స్థానిక సంజయ్‌నగర్‌లోనున్న బీఎస్‌ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంప్రసాద్ తీర్చిదిద్దారు. ఆయన కృషి ఫలితంగా ఏటా పదో తరగతి ఫలితాల్లో బీఎస్‌ఆర్ విద్యార్థులు టౌన్‌ఫస్ట్‌గా నిలుస్తూ వస్తున్నారు. ఇలా ఒకటి రెండు సారు కాదు.. ఇప్పటి వరకూ వరుసగా ఐదు పర్యాయాలు ఈ పాఠశాల విద్యార్థులే టౌన్ ఫస్ట్‌గా నిలిచారు. అంతేకాక చదువు మానేసిన వారి ఇళ్లకు వెళ్లి పాఠశాలలో చేర్పించేలా తల్లిదండ్రులకు సర్దిచెప్పి మరీ పాఠశాలలో చేర్పించేవారు. పదో తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులు రాత్రి పూట చదువుకుంటున్నారా లేదా అని వారి ఇళ్లకు వెళ్లి మరీ పరిశీలించేవారు. ఆయన కృషి ఫలితంగా బీఎస్‌ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పిల్లలను చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పోటీ పడేవారు. దీంతో తమ పాఠశాలలో సీట్లు లేవు అని బోర్డు తగిలించాల్సి వచ్చేది. ప్రస్తుతం హెచ్‌ఎం రాంప్రసాద్ కొత్తపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లారు.