
ఆంధ్రా ప్రెసిడెంట్ , మధ్యప్రదేశ్ జట్ల విజయం
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–19 టోర్నీలో భాగంగా గురువారం అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన రెండు మ్యాచుల్లో ఆంధ్రా ప్రెసిడెంట్, మధ్యప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. తొలుత ఆంధ్రా ప్రెసిడెంట్, ఆంధ్రా సెక్రెటరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. 49.1 ఓవర్లలో 232 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రా సెక్రెటరీ జట్టు కేవలం 30.4 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం మధ్యప్రదేశ్, బరోడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బరోడా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. 45.4 ఓవర్ల వద్ద 178 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 45.4 ఓవర్లలో 182 పరుగుల సాధించి విజయాన్ని కై వసం చేసుకుంది.