
మద్యం బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి టౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మద్యం బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవిందనాయక్, ఏఈఎస్ నరసింహులు తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీ రెండు, కదిరి మున్సిపాలిటీ, మడకశిర నగర పంచాయతీ పరిధిలో ఒకటి చొప్పున బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. 2025 సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్ట్ 31 వరకు బార్లు నిర్వహించుకునేందుకు వీలుగా లైసెన్సులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు పుట్టపర్తి ఉజ్వల ఫౌండేషన్ విల్లాలో ఉన్న జిల్లా ప్రొహిబిషన్, ఎక్‌పైజ్ కార్యాలయంలో ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు నేరుగా దరఖాస్తులు అందజేయాలన్నారు. లేదా ఆన్‌లైన్‌కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతో పాటు రూ. 5 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటు రూ.10 వేలు (ప్రాసెసింగ్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక బార్‌కు ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చన్నారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా బార్లను కేటాయిస్తామన్నారు. బార్లు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజును ఆరు వారయిదాల్లో చెల్లించవచ్చన్నారు.
బలవంతపు
భూ సేకరణ ఆపాలి
మడకశిర రూరల్: బలవంతపు భూసేకరణతో రైతుల పొట్టకొట్టవద్దని ఏపీ రైతు సంఘం నాయకులు అధికారులను వేడుకున్నారు. మండలంలోని పలు పంచాయతీల్లో సోలార్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం రైతు సంఘం నాయకులు వైబీ హళ్లి, సీ కొడిగేపల్లి పంచాయతీల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. సారవంతమైన భూములను సేకరించడాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి వైబీహళ్లిలో సోలార్ ప్రాజెక్టు వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరి, కార్యదర్శి పెద్దన్న, ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు మాట్లాడారు. రైతుల ఆమోదం లేకపోతే భూ సేకరణ చేయకూడదని 2013 భూ సేకరణ చట్టం చెబుతోందన్నారు. ఎకరాకు రూ.30 వేల ప్రకారం 30 ఏళ్లు అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా రైతులు భూ హక్కును కూడా ప్రమాదం ఉంటుందన్నారు. సీ కొడిగేపల్లి పంచాయతీలో సేకరించిన భూముల్లో ఇప్పటి వరకు సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనందున ఆ భూములను తిరిగి రైతులకు కేటాయించాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం చేస్తామన్నారు.