
అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
పుట్టపర్తి టౌన్: ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి అధ్యక్షతన 8వ జిల్లా మహాసభలు జరిగాయి. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, జిల్లా శ్రామిక సంఘం అధ్యక్షురాలు దిల్షాద్, అనంతపురం జిల్లా అధ్యక్షురాలు శకుంతల, కార్యదర్శి రమాదేవి పాల్గొని ప్రసంగించారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతన చట్టం అమలు చేయాలన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు. ఇతర పనులు కేటాయించరాదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. డిమాండ్ల సాధనకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా పి. శ్రీదేవి, కోఽశాధికారిగా రంగమ్మ, ఉపాధ్యక్షురాలుగా దిల్షాద్, మహదేవమ్మ, మరో 34 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ