
మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
పుట్టపర్తి టౌన్: మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 12వ పీఆర్సీ అమలు చేసి కనీస వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగభూషణ డిమాండ్ చేశారు. శుక్రవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఆ సంఘం 3వ జిల్లా మహాసభలు జరిగాయి. స్థానిక మున్సిపల్ యూనియన్ అఽధ్యక్షుడు వెంకటేష్ అధ్యక్షత వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు రామకృష్ణ, నరసింహులు, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లేబర్ కోడ్ పేరుతో చట్టాలను కుదించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్మికులకు 12 గంటల పని వేళలు పెంచడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరంచారు. కార్యక్రమంలో నాయకులు పైపల్లి గంగాధర్, నాగార్జున, నరసింహులు, రామయ్య, కేశవ, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం
అధ్యక్షుడు నాగభూషణ