
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్, అనుబంధ విభాగాల్లో పని చేసే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీ, అనుబంధ విభాగాల్లో పని చేస్తూ అకాల మృత్యువాతపడ్డ ఉద్యోగులకు సంబంధించిన వారసులు తొమ్మిది మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశం కల్పించారు. వారందరికీ జెడ్పీ చైర్‌పర్సన్ తన చాంబర్‌లో నియామకపత్రాలను మంగళవారం అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో ఎన్.మమత (పీఆర్‌ఐ సబ్ డివిజన్–మడకశిర), శోభ (ఎంపీపీ ఆఫీస్–మడకశిర), కేఆర్ రాఘవేంద్రరావు (ఎంపీపీ ఆఫీస్ –శెట్టూరు), వి.శకుంతల (జెడ్పీహెచ్‌ఎస్ – చెన్నేకొత్తపల్లి), సి.భార్గవి (జెడ్పీహెచ్‌ఎస్ – చుక్కలూరు), వై.ప్రసన్నకుమార్, పి.దీపక్ (జెడ్పీ–అనంతపురం), కె.బంధ నవాజ్ (పీఆర్‌ఐ, పీఐయూ–అనంతపురం), ఎస్.ధనలక్ష్మి (ఎంపీపీ ఆఫీస్ –బుక్కరాయసముద్రం) ఉన్నారు. వారినుద్దేశించి చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో బాధ్యతలను సమర్థవంతంగా అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య, ఏఓలు షబ్బీర్ నియాజ్, విజయభాస్కర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.