
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కియా చేయూత
పరిగి: విద్యార్థుల సమగ్రాభివృద్దికి కియా ఇండియా చేయూతనందిస్తుందని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ తెలిపారు. మంగళవారం ఆయన పరిగి మండలం కొడిగెనహళ్లిలో ఆంధ్రప్రదేశ్ గురుకుల ఆశ్రమ జూనియర్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఇటీవల కళాశాలలో కియా ఇండియా ఆర్థిక సౌజన్యంతో రూ.50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే పూర్తయిన శానిటేషన్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాలలో నిర్మించతలపెట్టిన డార్మెటరీ, డైనింగ్ హాల్, వేడి నీటి కోసం సోలార్ సిస్టమ్‌కు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రమీలమ్మ, శ్రీదేవి, బోధన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.