
కనీస వేతనం అమలు చేయాలి
ఎప్పటి నుంచో అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అడుగుతున్నాం. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. లక్ష్యాలను చేరుకోవాలని అంగన్‌వాడీలను ఇబ్బంది పెడుతున్నారు. చాలీచాలనీ జీతాలతో పాటు నిత్యావసరాల కొనుగోలుకు డబ్బు చెల్లించకపోతే ఎలా? అటవీ గ్రామాలు, మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ అందక వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు. యాప్‌ల భారం తగ్గించాలి. – మాబున్నీసా,
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు