
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
పెనుకొండ: ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఓ మహిళను పెనుకొండ పోలీసులు సకాలంలో కాపాడారు. వివరాలు.. రొద్దం మండలం బూదిపల్లికి చెందిన జయమ్మ కుటుంబ సమస్యలతో విసుగు చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సోమవారం పెనుకొండ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పీఎస్ ప్రొహిబేషనరీ ఎస్‌ఐ భువనేశ్వరి, ఏఎస్‌ఐ నాగరాజు, పీసీ రంగప్ప వెంటనే రైల్వేస్టేషన్ చేరుకుని పరిశీలించారు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోడంతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. స్టేషన్ సమీపంలో పట్టాల పక్కనే ఉన్న జయమ్మను గుర్తించి సర్దిచెప్పి పీఎస్‌కు పిలుచుకెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం జయమ్మను అప్పగించారు.