
బంతికి డిమాండ్
పెళ్లిళ్ల సీజన్‌తో పాటు విశిష్ట పండుగలు కలసి వచ్చిన ఈ శ్రావణ మాసంలో బంతి పూలకు భారీగా డిమాండ్ నెలకొంది. గతంలో కిలో బంతి పూలు కేవలం రూ.30 నుంచి రూ.40 వరకూ అమ్ముడు పోగా తాజాగా రూ.వందకు చేరుకుంది. త్వరలో వినాయక చవితి, దేవీ శరన్నవరాత్రులు, కార్తీక మాసం రానుండడంతో పూల ధరలు నిలకడగా ఉంటాయని రైతులు శిస్తున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా సుమారు 719 హెక్టార్లలో పూల తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 185 హెక్టార్లలో చామంతి, 30 హెక్టార్లలో రోజా, 35 హెక్టార్లలో జాస్మిన్, 200 హెక్టార్లలో బంతి, 153 హెక్టార్లలో కనకాంబరాలు, మరో 117 హెక్టార్లలో ఇతర రకాల పూల తోటల సాగును రైతులు చేపట్టారు. కదిరి, హిందూపురం, అనంతపురం, ధర్మవరం మార్కెట్లతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, చిక్కబళ్లాపూర్, బెంగళూరు మార్కెట్లకు పూల దిగుబడిని రైతులు తరలిస్తున్నారు.
– పుట్టపర్తి అర్బన్:

బంతికి డిమాండ్