
ప్రీ పీహెచ్‌డీ పరీక్షకు హాజరైన మాజీ మంత్రి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్వహించిన పరీక్షకు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ హాజరయ్యారు. ప్రొఫెసర్ కె.రాంగోపాల్ పర్యవేక్షణలో ఫిజిక్స్‌లో ఆమె పీహెచ్‌డీ చేస్తున్న విషయం తెలిసిందే.
నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో 2026–27 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్టు లేపాక్షిలోని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025–26 విద్యాసంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 23వ తేదీలోపు www. navodaya. gov. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2026, ఫిబ్రవరి 7న ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హులను ఎంపిక చేస్తారు. అలాగే ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకూ గడువు పొడిగించారు.
అనారోగ్యంతో
హెడ్ కానిస్టేబుల్ మృతి
కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు పీఎస్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ (45) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా సెలవు పెట్టి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం పరిస్థితి విషమించడంతో మడకశిరలోని తన స్వగృహంలో ఆయన మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలియగానే కంబదూరు పీఎస్ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రీ పీహెచ్‌డీ పరీక్షకు హాజరైన మాజీ మంత్రి