
చంద్రబాబు అంటేనే మోసం
గోరంట్ల (సోమందేపల్లి): ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లి, వడిగేపల్లి, పాలసముద్రం పంచాయతీలో జరిగిన బాబు ష్యూరిటీ .. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం 2.70 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమ చేశారని గుర్తు చేశారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్, నిరుద్యోగ భృతి, అన్నదాన సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమల చేయకుండా ప్రజలకు మోసం చేస్తున్నారని, అవన్నీ ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వెంకేటేష్, మేదర శంకర, జెడ్పీటీసీ సభ్యుడు జయరాంనాయక్, ఎంపీపీ ప్రమీల, వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు ఫకృద్దీన సాబ్, నాయకులు జయచంద్రరెడ్డి, ఈశ్వరప్ప, శ్రీనివాసరెడ్డి, పోతుల రామకృష్ణరెడ్డి, రఘురాంరెడ్డి, శంకర్‌నాయక్, శ్రీధర్‌రెడ్డి, బాబావలి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్