
స్థల ఆక్రమణకు టీడీపీ నాయకుల యత్నం
● పోలీసులకు ఫిర్యాదు చేసిన
బాధితుడు
నల్లచెరువు: మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తన స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పడుచూరి నగేష్ కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగేష్‌కుమార్‌కు జాతీయ రహదారి పక్కనున్న వేరుశనగ ఫ్యాక్టరీ ముందు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అల్లాబకాష్, టీడీపీ మండల మాజీ కన్వీనర్ శివారెడ్డి, ఆయన అల్లుడు ప్రసాద్‌రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేశారు. జేసీబీతో చదును చేయిస్తుండగా నగేష్‌కుమార్ అడ్డుకున్నాడు. వారం రోజుల్లో ఇక్కడ భవనం నిర్మిస్తామని, దిక్కున్న చోట చెప్పుకో అని సదరు వ్యక్తులు బెదిరించారని నగేష్‌కుమార్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.