
అంబేడ్కర్ స్మృతివనం ప్రైవేటీకరణపై ఆగ్రహం
మడకశిర: విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జీఓ జారీ చేయడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మడకశిరలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వివిధ దళిత సంఘాల నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీఓ ప్రతులను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ వైఎస్‌జగన్ హయాంలో రూ.కోట్లు వెచ్చించి అంబేడ్కర్ స్మృతి వనం ఏర్పాటు చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం స్మృతి వనాన్ని ప్రైవేట్‌పరం చేయడం దళితులకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలోనే స్మృతి వనాన్ని నిర్వహించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు శివన్న, క్రిష్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు నరసింహ, బూత్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మంజునాథ్, మైనార్టీ సెల్ కార్యదర్శి సికిందర్, పట్టణ వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షులు గోపి, వైఎస్సార్‌సీపీ దళిత నాయకులు ధను, నగేష్, బీసీ సెల్ కార్యదర్శి సత్యనారాయణ, సర్పంచులు రంగనాథ్, హనుమంతప్ప, టీడీపల్లి రంగనాథ్, అంజినప్ప, అంజలి తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ సర్కిల్ వద్ద
దళిత సంఘాల ఆందోళన