పరిశ్రమల జాడేదీ..? | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల జాడేదీ..?

Jul 7 2025 6:44 AM | Updated on Jul 7 2025 6:44 AM

పరిశ్

పరిశ్రమల జాడేదీ..?

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడాదిగా విచిత్ర పరిస్థితి నెలకొంది. ‘మిమ్మల్ని లక్షాధికారులను చేస్తాం, ఇంటింటికీ ఉద్యోగమిస్తాం, లేకుంటే నిరుద్యోగ భృతి అందిస్తాం’ అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన టీడీపీ నేతల నోట ఆ మాటే నేడు రావడం లేదు. ఆ మాటలు ఇప్పుడు వారికి కొరగానివిగా తయారయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా రాప్తాడు, పెనుకొండ, హిందూపురం ప్రాంతాలు చిన్న, సూక్ష్మ, భారీ పరిశ్రమలకు అనుకూలం. కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు ప్రాంతాల్లోనూ ఇప్పటివరకూ ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. ఎంఎస్‌ఎంఈల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.

అరాచకాలతో రాంరాం..

జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం పరిశ్రమల ఏర్పాటుకు బాగా అనుకూలమని చెబుతారు. నియోజక వర్గం గుండా జాతీయ రహదారి వెళ్తుండడం, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగంగా చేరుకునే అవకాశం తదితర సానుకూలతలున్నా హత్యలు, భూకబ్జాలు, ఆక్రమణలు, రౌడీయిజం, దొంగతనాలు వెరసి చిన్న పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. శాంతిభద్రతలు అదుపుతప్పడంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు రావడానికి వెనకాడుతున్నారు. గడిచిన ఏడాదిలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన పాపాన పోలేదు. ‘కొత్త పారిశ్రామిక పాలసీ తెచ్చాం, పెట్టుబడులు పెట్టండి’ అంటూ అధికారులు ఎంత బతిమాలినా ‘మాకొద్దు బాబూ’ అంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలు రాకపోవడంతో పాటు ఉన్న ఉద్యోగాలకు కూడా గండం ఏర్పడింది.

పెనుకొండ.. హిందూపురంలోనూ అంతే

పెనుకొండ, హిందూపురం ప్రశాంతంగా ఉండే పట్టణాలు. అలాంటిది నేడు రాజకీయ నాయకుల అండతో టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. స్వయానా ప్రజాప్రతినిధులే ఉసిగొలిపి ఇదంతా చేయిస్తున్నారు. పెనుకొండలో ఓ రీమిక్స్‌ప్లాంట్‌ యాజమాన్యాన్ని స్వయానా మంత్రి బెదిరించడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. చిన్న పరిశ్రమ నెలకొల్పడానికి ఎవరైనా వచ్చినా వసూళ్లకు తెగబడుతున్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే పీఏలుగా చెప్పుకుంటూ కొందరు చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. కూటమి సర్కారు వచ్చినప్పటినుంచీ అక్కడ ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. మద్యం, జూదం తీవ్రస్థాయిలో జరుగుతుండటంతో పెట్టుబడిదారులు హిందూపురం రావడానికి మొగ్గు చూపడం లేదు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం అదీ ఇవ్వలేదు.

ఏడాది ముగిసినా చిన్న పరిశ్రమకూ దిక్కులేదు

లక్షల్లో ఉద్యోగాలని ఒక్కటీ ఇవ్వలేదు

ఎంఎస్‌ఎంఈలు పెట్టడానికీ మొగ్గుచూపని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు

రాప్తాడులో దారుణ పరిస్థితుల

నేపథ్యంలో అటువైపే చూడని వైనం

పెనుకొండ, హిందూపురం

పట్టణాల్లోనూ ఇంతే...

ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతీ

అందక అల్లాడిపోతున్న నిరుద్యోగులు

పరిశ్రమల జాడేదీ..? 1
1/2

పరిశ్రమల జాడేదీ..?

పరిశ్రమల జాడేదీ..? 2
2/2

పరిశ్రమల జాడేదీ..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement